Posts

నాన్న కోసం మణిపూసలు

Image
వడిచెర్ల సత్యం రచించిన...  * నాన్న కోసం మణిపూసలు * *********************** ఐతే,రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ ప్రక్రియలో ఇంతకు ముందే అమ్మ గురించి ఐదారు మణిపూసలు రాసిన. కానీ నాన్న గురించి ఒక్కటి కూడా రాయక పోతిని అని దాదాపు రెండు సంవత్సరాల నుంచి నా మనసులో  అనుకుంటున్న తపన ఎట్టకేలకు ఇప్పుడు సాకారమైంది.ఇందులోని 36 మణిపూసలలో కేవలం నాన్నకు సంబందినవే 28  శ్రీ బ్రహ్మణి చరణాలకు అమ్మ నాన్న చరణాలకు వందన హరిచందనాలు గురుదేవుని చరణాలకు! మన వెంబడి వుండలేక మన యల్లరి జూడలేక తల్లిదండ్రి నిడె దేవుడు మన రక్షణ చేయలేక మన పుట్టుక కారకులు తరతరాల వారసులు ఉన్నారా లోకమందు? అమ్మనాన్న సమానులు! నా జీవము మా నాన్న నా చేవము మా నాన్న నా జన్మకు మూలమైన నా దైవము మా నాన్న! ఎదపై ఆడించిండు ముద్దుల గురిపించిండు నా నవ్వుల జల్లులలో నాన్న తడిసి మురిసిండు! వేలు బట్టి నడిపించెను లోకమంత చూపించెను నేను గొప్ప గెదుగాలని నాన్న నన్ను కోపించెను! నా కొరకు యోచించెను నా కొరకు కష్టించెను నేను లేని వేళ నాన్న నా కొరకు విలపించెను! తన గుండెల హత్తుకొని తన ప్రేమల పంచుకొని నా ఉన్నతి కెదిరి చూసె తన యాశల చెప్పుకొని మంచిచెడులు చెప్పిండు సూచనలను

మణిపూసలు

Image
మణిపూసలు వడిచర్ల సత్యం * మణిపూసల రూపకర్త నేను,తేది: 26.4.2018 నాడు వాట్సప్ వేదికగా ప్రారంభించిన నూతన కవితా ప్రక్రియ మణిపూసలు నేడు ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ కాలంలోనే అత్యంత జనాదరణ పొంది, అనూహ్య సంచలనం సృష్టించిన సంగతి పాఠకలోకానికి తెలిసిందే."ఈ ప్రక్రియకు ఇంత గొప్ప గుర్తింపు, ప్రఖ్యాతి రావడానికి మణిపూసలు రాస్తున్న రసహృదయులైన కవిదేవుళ్లుతో పాటు; వాట్సప్ గ్రూప్ లు, పేస్ బుక్ , యూట్యూబ్, పత్రికలు, విమర్శకుల పుస్తక సమీక్షలు, నా తల్లి దండ్రి దీవెనలు, గురువుల ఆశీస్సులు, ఆర్థిక  సహకారమందించిన దాతల విశాల హృదయ వైభవం,మిత్రుల ప్రోత్సాహం,  అభినందన జల్లులు వెల్లువ, మరియు ఆ అక్షరాంబ కురిపించిన కృపా కటాక్షములే కారణం" అని నేను బలంగా విశ్వసిస్తాను.  వీటిని చదివినవారిలో ఏ ఒక్కరైనా వాస్తవాన్ని గ్రహిస్తే,నా కవితా ప్రయత్నం సఫలమయినట్లేనని భావిస్తున్నాను. ఆబాలగోపాలం చేత ఆకర్షించబడి , అలరించబడుతున్న ఈ మణిపూసలను ఇక ముందు కూడా ఆదరించి, దీవించాలని  కవితా ప్రియులను కోరుకుంటూ....... ఈ సందర్భంగా మణిపూసలను రచించిన కవులకు,చదివిన పాఠకులకు,సామాజిక ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు, ప్రోత్సహించిన పత్రికల సంప